'సామాజిక సంఘాల పేరుతో దోపిడీకి యత్నిస్తున్న వ్యక్తి అరెస్టు'

ADB: సామాజిక సంఘాల పేరుతో టైగర్ గ్రూప్ పేరిట దోపిడీకి యత్నిస్తున్న జాదవ్ గోపాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ బీమెష్ తెలిపారు. మితిమీరిన రౌడీయిజం, వసూలు, బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, నేరడిగొండ మండలంలో పశువులు తరలిస్తున్న వాహనాల్ని ఆపి బెదిరింపులకు పాల్పడ్డ గోపాల్‌పై కేసు నమోదు చేశారు.