విద్యార్థులతో కలిసి భోజనం చేసిన RDO
KMR: ఎల్లారెడ్డి మైనార్టీ గురుకుల పాఠశాలను ఆర్డీవో పార్థ సింహ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఏజెన్సీకి సూచించారు. అలాగే మెనూ ప్రకారం కూరలు పెట్టాలన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.