VIDEO: భారీ వర్షానికి నీటి మునిగిన తహసీల్దార్ కార్యాలయం

VIDEO: భారీ వర్షానికి నీటి మునిగిన తహసీల్దార్ కార్యాలయం

కోనసీమ: రావులపాలెంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి రావులపాలెం తాసీల్దార్ కార్యాలయం పూర్తిగా నీట మునిగింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కార్యాలయం వద్ద నీరు నిలిచిపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడంతో కార్యాలయ ప్రాంగణం వద్ద నీరు నిలిచిపోయింది.