అర్ధరాత్రి వృద్ధుడి హత్య

అర్ధరాత్రి వృద్ధుడి హత్య

శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఇప్పిలికి చెందిన కరణం నర్సింగరావు (60) అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన ఇద్దరు కుమారులు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రాత్రి మేడ మీద నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో తలపై కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసుపై దర్యాప్తు చేపట్టారు.