ఎస్సీల భూ సమస్యలు పరిష్కరించాలి: భీమ్ ఆర్మీ
GDWL: ఎస్సీల భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, వెంటనే పరిష్కరించాలి అని భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ ప్రకాష్ డిమాండ్ చేశారు. బుధవారం కేటీదొడ్డి మండలంలో కార్యకర్తలతో కలిసి స్థానిక తహసీల్దార్ రవికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీల శ్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేసి, ఆ భూమిని ఆన్‌లైన్ చేయాలని ఆయన తహసీల్దార్‌ను కోరారు.