ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

JGL: దరూర్ క్యాంప్‌లో ఈవీఎం గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ప్రతినెల ఈవీఎంలను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. గోదాములో యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అదనపు కలెక్టర్ బీ. రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.