పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ
PDPL: ముత్తారం మండల పరిధిలోని పాత నేరస్థులకు ముత్తారం పోలీస్ స్టేషన్‌లో మంథని సీఐ బి.రాజు, ఎస్సై ఎన్. రవికుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడకూడదన్నారు. సత్ప్రవర్తనతో మెలుగుతూ కుటుంబాలను మంచిగా చూసుకోవాలని సూచించారు. అలాకాకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.