రేపు జాబ్ మేళా

రేపు జాబ్ మేళా

HNK: జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జనగామ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. పేటీఎం, జస్ట్ డయల్, హెచ్ఎఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.