నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసిన సర్పంచ్
NZB: నవీపేట్ మండలంలోని మహంతం గ్రామంలో వేసవికాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా 15 కేవీ ట్రాన్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ సుంకరి రాజు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి నూతన ట్రాన్స్ ఫార్మర్ అమర్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, లైన్ ఇన్‌స్పెక్టర్ గౌస్, లైన్ మెన్ శంకర్, సిబ్బంది పవన్, నాగరాజు పాల్గొన్నారు.