'సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి'
SRPT: సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఏఎస్సై నరేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు పట్టణంలో ఓ స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు నిబంధనలు, సైబర్ నేరాల నియంత్రణ, షీటీమ్స్ తదితర అంశాలపై పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మేరకు కళాబృందం ఇంఛార్జ్ యల్లయ్య, గోపయ్య పాల్గొన్నారు.