ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు

SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. ముస్తాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవాన్ని వాహనదారులకు ఇబ్బందులు కలిగే విధంగా రోడ్డుపై జరిపారు. దీంతో రోడ్లపై వచ్చి పోయే జనాలకు ఇబ్బందులు కలిగించినందుకు యాజమాన్యంతో పాటు ఆర్గనైజర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.