బైక్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు

ATP: గుత్తి పట్టణ శివారులోని సితార ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.