నేడు ఏయూ శ‌తాబ్ది ఉత్స‌వాల సాంస్కృతిక సంబ‌రాలు

నేడు ఏయూ శ‌తాబ్ది ఉత్స‌వాల సాంస్కృతిక సంబ‌రాలు

VSP: విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో డాక్టర్ విజయవేణి పర్యవేక్షణలో మెగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విద్యార్థులు బాంగ్రా, లంబాడి, భరతనాట్యం వంటి నృత్యాలతో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంపై విద్యార్థుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.