అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: జేసీ 

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: జేసీ 

W.G: జిల్లా కలెక్టరేట్లో శనివారం జరిగిన సమీక్షలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని ఆదేశించారు. జిల్లాలో అందిన 13,738 ఫిర్యాదులలో 13,006 పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు. మిగిలిన 732 అర్జీలను నాణ్యతతో, గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.