108, 102 అంబులెన్స్‌ల తనిఖీ
ASF: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆసుపత్రి వద్ద ఉన్న 108, 102 అత్యవసర సేవల అంబులెన్స్‌లను(ambulances) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, 108 జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లలో ఉన్న మెడికల్ స్టాక్, వైద్య పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు.