అప్పులు బాధ తాళలేక సూసైడ్

అప్పులు బాధ తాళలేక సూసైడ్

కృష్ణా: ఆర్థిక భారాన్ని తట్టుకోలేక యువకుడు మృత్యువును ఆశ్రయించిన ఘటన ఉంగుటూరు మండలం పెదఆవుటపల్లిలో చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న దొప్పల సురేష్(39) వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు పెరిగి, అప్పుదారుల ఒత్తిడిని భరించలేక సోమవారం ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.