బురద గుంటను తలపిస్తున్న ఆర్‌అండ్‌బీ రహదారి
SKLM: లక్ష్మీ నర్సుపేట గ్రామంలో బస్టాండ్ నుండి హైస్కూల్ వరకు ఆర్‌అండ్‌బీ రహదారి బురద గుంటగా తయారైంది. ఏ మాత్రం వర్షం కురిసిన గుంటల్లో నీరు చేరి మురికి కూపంగా తయారై దుర్గంధం వెదజెల్లుతుంది. గ్రామస్తులు వ్యాధులు బారిన పడుతున్నారు. లక్ష్మీ నర్సుపేట జంక్షన్ నుండి మిరియాపల్లి గ్రామాల గుండా తురకపేట జంక్షన్‌కు రహదారి నిర్మించలేదు. ఏళ్ల తరబడి మరమ్మతులు నోచుకోలేదు.