ప్రభుత్వంపై ఉద్యమం చేస్తాం: ఎంపీ ఈటల
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోందని MP ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని మండిపడ్డారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుపై సుప్రీంలో కేసు వేస్తామని వెల్లడించారు. GHMC ఎన్నికలపై రఘునందన్‌రావు, కొండాతో చర్చిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామన్నారు. వైరుధ్యాలు, పోటీతత్వంలేని పార్టీలు ఉండవన్నారు.