'గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నాం'
SDPT: పదేళ్ల BRS ప్రభుత్వంలో చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా నిలుపుకున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ క్రమంలో గాంధీ విగ్రహన్ని ఆవిష్కరించి, సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరం ఐక్యతతో ఉండి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.