VIDEO: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ ఆలయ తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. తలుపులు తెరిచిన వెంటనే భక్తులు జయజయధ్వానాలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి 10 వేల మందికి పైగా భక్తులు బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకున్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లోని ఈ పవిత్ర క్షేత్రం విష్ణువుకు అంకితమైన 108 దివ్య దేశాలలో ఒకటి. దీనికి సంబంధించి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.