'రైతుల పోరాటం గెలిచింది'

'రైతుల పోరాటం గెలిచింది'

AKP: రైతుల పోరాటం గెలిచి అమరావతి శాశ్వతంగా నిలిచిందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన అమరావతి సంబరాల్లో మంత్రి జాతీయ జెండా చేత పట్టుకుని పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా విరాజిల్లుతుందన్నారు. స్థానిక జనసేన కార్యాలయం నుండి జరిగిన ర్యాలీలో కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు.