విశేష అలంకారంలో అంజన్న

విశేష అలంకారంలో అంజన్న

KDP: శ్రావణమాస చివరి శనివారం సందర్భంగా అభయాంజనేయస్వామికి విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ప్రసాద శర్మ ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి అలంకరించారు. పలువురు స్వామివారికి ప్రీతిపాత్రమైన ఆకుపూజ చేయించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరం సమర్పించారు. కాగా, ఆలయ అర్చకులు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.