జీపీ నూతన కార్యాలయానికి నిధులు మంజూరు

KMR: మల్లాపూర్ గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నూతన భవన నిర్మాణానికి గురువారం మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి పాటుపడే నాయకుడు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అని అన్నారు.