VIDEO: దోమడుగులో హెటిరో డ్రగ్స్ కాలుష్యంపై ధర్నా
SRD: దోమడుగులో హెటిరో డ్రగ్స్ యూనిట్-1 వల్ల జరుగుతున్న కాలుష్యానికి నిరసనగా గ్రామస్థులు హైదరాబాద్ సనత్‌నగర్‌లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేశారు. చెరువులు, భూగర్భ జలాలు విషపూరితమయ్యాయని పేర్కొంటూ కంపెనీని మూసేయాలని, నిర్లక్ష్యమైన PCB అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.