'హాఫ్ మారతాన్‌లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి'
WGL: ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకై వరంగల్‌లో ఈనెల 23న నిర్వహించబోయే హాఫ్ మారతాన్‌లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని MLA నాయిని రాజేందర్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. ఈ మారతాన్ WGL చరిత్రలో మొదటిసారిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వరంగల్ చరిత్రను, ప్రత్యేకతను దేశవ్యాప్తంగా తెలియజేసే విదంగా ఉండబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.