ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ

సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామంలో నూతన ఎల్లమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.