వాహనదారులు హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం

NDL: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం శ్రేయస్కరమని ఎస్సై మహమ్మద్ రఫీ సూచించారు. సోమవారం ముత్తులూరు గ్రామంలోని అహోబిలం రోడ్డులో ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చున్నారు. అనంతరం వాహనదారులు రహదారి నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.