రేవంత్‌‌ మూర్ఖపు మాటలు మానుకోవాలి: ఎర్రబెల్లి

రేవంత్‌‌ మూర్ఖపు మాటలు మానుకోవాలి: ఎర్రబెల్లి

TG: CM రేవంత్‌ తన మాటకారితనంతో తుపాకీ వెంకట్రావులా ప్రజలను మభ్యపెడుతున్నారంటూ BRS నేత ఎర్రబెల్లి దయాకర్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా మూర్ఖపు మాటలు మానుకోవాలని.. ఆయన వల్లే హైదరాబాద్ మొత్తం మునిగిందని, ధాన్యం తడిసిపోయిందని ఆరోపించారు. మోసపూరిత మాటలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రేవంత్ BJPతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు.