ఫిరంగిపురంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం

ఫిరంగిపురంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం

GNTR: ఫిరంగిపురంలో శుక్రవారం పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేశారు. సూపర్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఏకే.బాబు తెలిపారు. ఈ మేరకు గ్రామంలోని ప్రధాన వీధులు, కాల్వలు శుభ్రపరచడం, చెత్త సేకరణ వంటి పనులు చేపట్టారు.