స్కేటింగ్‌లో మెరిసిన నెల్లూరు చిన్నారి

స్కేటింగ్‌లో మెరిసిన నెల్లూరు చిన్నారి

నెల్లూరుకు చెందిన అద్వైత రమ్య జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటింది. విశాఖలో జరిగిన ఈ పోటీల్లో రమ్య బంగారం, వెండి పతకాలు కైవసం చేసుకుంది. మోహన్ కుమార్, శ్వేత దంపతుల కుమార్తె అయిన ఈమె, కోచ్ జితేంద్ర వద్ద శిక్షణ పొందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించి, ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి పేరు తేవడమే తన లక్ష్యమని రమ్య తెలిపింది.