నగరంలో రాజస్థాన్ యువకుడి అదృశ్యం

HYD: నగరానికి వచ్చిన రాజస్థాన్ యువకుడు అదృశ్య మయ్యాడు. సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్సై మాజిద్ తెలిపిన మేరకు.. సుభం జాంగీర్ (28) నాలుగు నెలల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. ఏప్రిల్ 27న చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి రాజస్థాన్ వస్తున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే సొంతగ్రామానికి చేరుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.