బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే రాజా
కృష్ణా: పామర్రు మండలం అడ్డాడ గ్రామంలో గ్రామపార్టీ సెక్రటరీ కాటూరి శ్రీనివాసరావు శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా వారి గృహనికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్శనలో కృష్ణా జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ ఛైర్మన్ వల్లూరుపల్లి గణేష్, వారితోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.