జిల్లా కేంద్రంలో కుక్కలు బెడద
WNP: జిల్లా కేంద్రంలో కుక్కలు పగలు, రాత్రి తేడా లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులపై దాడి చేస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు, పాఠశాలల విద్యార్థులు, వృద్ధులు వీధుల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు. పుస్తకాల బ్యాగులతో స్కూల్లకు నడుచుకుంటూ.. వెళుతున్న విద్యార్థుల వెంటపడి కరుస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. విధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.