పెనుకొండలో ధర్నా కరపత్రాలు విడుదల

పెనుకొండలో ధర్నా కరపత్రాలు విడుదల

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని గాంధీ సర్కిల్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఇళ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలి- కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి అనే కరపత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ హరి మాట్లాడుతూ.. సొంత ఇంటి కోసం ఈనెల 29న పెనుకొండ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని, జయప్రదం చేయాలని కోరారు.