కోడిపందెం శిబిరంపై పోలీసుల దాడి

SKLM: కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరంపై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశామని ఎస్సై ఎస్ చిరంజీవి తెలిపారు. ఆదివారం సాయంత్రం రణస్థలం మండలం తోటపాలెంలోని కొబ్బరి తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందింది అన్నారు. ఈ క్రమంలో శిబిరంపై దాడి చేశామన్నారు. ఈ దాడిలో రూ.2,000, ఒక స్కూటీ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేసామని తెలిపారు.