ఉరుసు మహోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

ఉరుసు మహోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును కడప అమీన్ పీర్ దర్గా పిఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉరుసు మహోత్సవం నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.