సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగపడిగ విరాళం

NDL: పాణ్యం మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి దేవ సేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు వెండి నాగ పడిగను విరాళంగా అందజేసినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన కంప మల్ల వెంకట లక్ష్మమ్మ, సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు హరిప్రసాద్ రెడ్డి1 కేజీ 10 గ్రాముల వెండి నాగపడిగను అందజేసినట్లు తెలిపారు.