ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయం
KDP: 10 రోజులుగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయమని కడప ఎంపీ వై.యస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బాకరాపురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంభం తిరుమలరెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కంటి పొర శిబిరాన్ని ఎంపీ పరిశీలించారు. ఇందులో భాగంగా అద్దాలు, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం మంచి విషయమని ఎంపీ కొనియాడారు. అనంతరం దాతను ఎంపీ అవినాష్ రెడ్డి సన్మానించారు.