నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రకాశం: పొన్నలూరు తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం రెవెన్యూ సమస్యల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరవుతారని ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.