'ఈనెల 6వ తేదీ నుంచి సమ్మె'
ASR: కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం చింతపల్లి మండలం కిన్నెర్ల ఏపీఎఫ్ డీసీ కాఫీ తోటల్లో పనిచేస్తున్న కార్మికులతో సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు రోజువారీ వేతనాలు పెంచాలన్నారు. డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 6వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామన్నారు.