VIDEO: గొర్లవీడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామపంచాయతీలో జరుగుతున్న 2వ విడత స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు. ఈ సందర్భముగా పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.