మసెమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

మసెమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

CTR: పుంగనూరు మండలం కొండచర్లకురప్పల్లె మసెమ్మ జాతర శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ జాతర వేడుకలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గ్రామస్థులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు సాయంత్రం గ్రామ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 1న ఆదివారం అమ్మవారి దర్శనం అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.