నందిగామలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

నందిగామలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఆయన మాట్లాడుతూ.. న్యాయవాది కోట దేవదాసుపై నందిగామ పోలీసు వారు నమోదు చేసిన కేసును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తనకు ఎటువంటి సంబంధం లేక పోయినా కేసు నమోదు చేయటం చాలా బాధాకరమని, తక్షణమే తనను ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు.