అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం

అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం

KKD: కాజులూరు మండలం తిప్పరాజుపాలెంలో బుధవారం బాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన తాటాకిల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. మంటలు చెలరేగడంతో బాలకృష్ణ తన భార్య, ముగ్గురు పిల్లలతో సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.