అండర్‌పాస్ బ్రిడ్జి అవసరాన్ని పరిశీలించిన పోలీసులు

JN: జనగామలోని బాణాపురం వద్ద నిర్మాణంలో ఉన్న NH365B రోడ్డుకు అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ.. సీపీఎం ఆధ్వర్యంలో 101 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం విరమించాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సీఐ దామోదర రెడ్డి, ఎస్సై రాజేష్‌లు నేడు సంఘటనా స్థలానికి వెళ్లి అండర్‌పాస్ బ్రిడ్జి అవసరాన్ని పరిశీలించారు.