మెడికల్ కళాశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
MNCL: హాజీపూర్ మండలంలోని గుడిపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం పనులను మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మెడికల్ కళాశాల మంజూరుకు తాను ఎంతో కృషి చేశానని తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి త్వరితగతిన ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.