ఫీషర్మెన్ సొసైటీ అధ్యక్షునిగా దెయ్యాల రమణ
E.G: గోకవరం(మం) కొత్తపల్లి, కామరాజుపేట గ్రామాలకు చెందిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నిక శనివారం ఏకగ్రీవంగా ముగిసింది. సొసైటీ కార్యాలయంలో గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా దెయ్యాల రమణ ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 9 మంది సభ్యులను మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు.