మంత్రి కందుల చిత్రాన్ని గీసిన చిన్నారి

మంత్రి కందుల చిత్రాన్ని గీసిన చిన్నారి

E G: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌పై ఓ చిన్నారి వినూత్నంగా అభిమానం చాటుకుంది. కెవిఎస్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న పూజిత, గత రెండేళ్లుగా ఆయన చిత్రాలను గీసి బహుమతిగా అందించింది. చిన్నారి ప్రతిభకు మంత్రి దుర్గేష్ మురిసిపోయి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆశీర్వదించారు.