రేపు నర్సాపురంలో 'జనవాణి': ఎమ్మెల్యే
WG: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నర్సాపురం జనసేన కార్యాలయంలో శుక్రవారం 'జనవాణి' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు MLA బొమ్మిడి నాయకర్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.