రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

SRPT: చివ్వెంల మండలంలోని గుంజలూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన భాను ప్రకాష్ అనే యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం తన స్నేహితులతో కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా, గుంజలూరు వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు.